లాక్ డౌన్ లో ఆ ఫోన్ నెంబరు మోత మోగుతోంది

ఆపద సమయంలో వెంటనే కాల్ చేస్తే వచ్చేవారు ఎవరంటే పోలీసులు. అంతే కాకుండా మనకు టక్కున గుర్తు వచ్చే నెంబరు డయల్ 100. పోలీసులతో పాటు ప్రభుత్వం [more]

Update: 2020-04-07 12:34 GMT

ఆపద సమయంలో వెంటనే కాల్ చేస్తే వచ్చేవారు ఎవరంటే పోలీసులు. అంతే కాకుండా మనకు టక్కున గుర్తు వచ్చే నెంబరు డయల్ 100. పోలీసులతో పాటు ప్రభుత్వం కూడా ఏదైనా ఆపద సమయంలో తప్పనిసరిగా డయల్ 100 కు కాల్ చేయమని చెప్తుంది. కానీ డయల్ 100 ఇప్పుడు పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని చెప్పవచ్చు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి 12 లక్షల పైచిలుకు కాల్స్ వచ్చాయి. ఎక్కువ గా పోకిరీలు అనవసరంగా కాల్ చేసే వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకు చూస్తే దీంట్లో ఎమర్జెన్సీ కాల్ సంబంధించి 78000 నమోదు కాగా, కరోనా కు సంబంధించి 24 ,18 కేసులు కాల్ అవర్స్ చేయడం జరిగింది. దీనితో పాటుగా లాక్ డౌన్ సంబంధించిన సమాచారం కావచ్చు విషయాలు తెలుసుకోవడానికి 1 8 3 0 8 కాలర్స్ ఫోన్ చేశారు. దీంతో పాటుగా ఎంక్వైరీ కోసం చేసిన వారు 53525 మంది. అయితే మిగతా వారు కూడా చాలావరకు పోకిరీలు అనవసరంగా కాల్ చేసే వారే ఎక్కువగా ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు.

పోకిరిగాళ్లే ఎక్కువ…

దీనికి సంబంధించి ఆపరేషన్ హెడ్ గా ఉన్న చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రధానంగా డయల్ 100కి చాలామంది పోకిరిలు కాల్ చేస్తున్నారని, అనవసరంగా కాల్ చేసే వాళ్లే ఎక్కువగా ఉంటున్నారని, దీనివల్ల నిజమైన బాధితులకు తాము న్యాయం చేయలేక పోతున్నామని తెలిపారు. నిజమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారు ఎవరైనా కాల్ చేసిన పక్షంలో ఇలాంటి పోకిరీల కాల్స్ వల్ల ఫోన్ ఎంగేజ్ వస్తుందని కాబట్టి ఇలాంటి పోకిరీలు కాల్ చేసి తమ సమయాన్ని ,ప్రజల సమయాన్ని వృథా చేయొద్దని పోలీసులు కోరుతున్నారు. ప్రధానంగా డయల్ 100 ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు డయల్100కి కాల్ చేయమని సీఎం పిలుపునిచ్చారు. ఈ పిలుపు ఇచ్చిన మరుసటి రోజు నుంచి దాదాపు రెండు లక్షల కాల్స్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు అసలు డయల్ 100 పనిచేస్తుందా లేదా డయల్100 ఏమి చెప్పారు అన్న ఉత్సాహంతో చేసే వారు ఎక్కువగా ఉంటుందని పోలీసులు అంటున్నారు. ప్రధానంగా డయల్ 100 మిస్ యూజ్ చేసినట్లయితే శిక్షలు తప్పవని అధికారులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి కూడా డయల్ 100 ఆపద సమయాల్లో ఆదుకోవాల్సిన డయల్100 మిస్ యూస్ పోకిరి లపై భరతం పడితే కానీ అసలు బాధితులకు న్యాయం జరగదని చాలామంది చెబుతున్నారు

Tags:    

Similar News