లాక్ డౌన్ ఉన్నా… మందుబాబులు మాత్రం?

ఒకవైపు లాక్ డౌన్ , రాత్రి సమయంలో కర్ఫ్యూ ఇవన్నీ ఉన్నప్పటికీ మందుబాబులు మాత్రం తమ పని కానిచ్చుకొని పోతున్నారు. మద్యం మత్తులో హైదరాబాదులో వీరంగం సృష్టిస్తున్నారు. [more]

Update: 2020-04-07 12:20 GMT

ఒకవైపు లాక్ డౌన్ , రాత్రి సమయంలో కర్ఫ్యూ ఇవన్నీ ఉన్నప్పటికీ మందుబాబులు మాత్రం తమ పని కానిచ్చుకొని పోతున్నారు. మద్యం మత్తులో హైదరాబాదులో వీరంగం సృష్టిస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున మందుబాబు చేసిన హల్ చల్ తో పోలీసులు హైరానా పడ్డారు. ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో ఒక కారు అదుపు తప్పింది డివైడర్ను ఢీకొనడంతో పెద్ద ప్రమాదమే తప్పిపోయింది. కార్లు బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కానీ కారు చేసిన హంగామా కి పోలీసులు పరుగులు పెట్టారు. అర్ధరాత్రి ఎన్టీఆర్ గార్డెన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతి వేగంతో కారు పల్టీ కొట్టింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడం తో ప్రమాదం తప్పయింది. కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో దేశ వ్యాపంగా లాక్ డౌన్ ,కర్ఫ్యూ అమలవుతున్న దృష్ట్యా వాహనాలను ఎవరిని కూడా అనుమతించడంలేదు పోలీసులు. కానీ మద్యం సేవించిన ఒక యువకుడు ఎన్టీఆర్ గార్డెన్ రోడ్డు మీదికి వచ్చాడు. మద్యం మత్తులో కారు నడినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కారులో మద్యం సీసాలు లభ్యం అయ్యాయి. హిమయత్ నగర్ నుండి అతి వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి పల్టీ కొట్టిగా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయట పడ్డారు. రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రమాదానికి కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News