వందే భారత్… మనదే గోల్డ్…
శంషాబాద్ విమానాశ్రయంలో మరొకసారి భారీగా బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. వందే భారత్ మిషన్ లో భాగంగా ఇండియా కు వస్తున్న ప్రయాణికులు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా అధికారులు [more]
శంషాబాద్ విమానాశ్రయంలో మరొకసారి భారీగా బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. వందే భారత్ మిషన్ లో భాగంగా ఇండియా కు వస్తున్న ప్రయాణికులు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా అధికారులు [more]
శంషాబాద్ విమానాశ్రయంలో మరొకసారి భారీగా బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. వందే భారత్ మిషన్ లో భాగంగా ఇండియా కు వస్తున్న ప్రయాణికులు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు దుబాయ్ నుంచి వస్తున్న విమానంలో ప్రయాణికులను చెక్ చేయగా 3.66 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 మంది ప్రయాణికుల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నట్లుగా కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రయాణికులందరూ కూడా తమ లోదుస్తుల్లో బంగారాన్ని దాచిపెట్టి తీసుకువస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలు రాకపోకలు ఇప్పటికే నిషేధం ఉన్నాయి. ఇటీవల కాలంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు వందే భారత్ మిషన్ ను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విదేశాల్లో ఉన్న భారతీయులు ఇండియాకి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వందే భారత్ మిషన్ కింద హైదరాబాద్ కు వచ్చిన 11 మంది ప్రయాణికులు బంగారం స్మగ్లింగ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అధికారులు వెల్లడించారు.