బస్సులు లేవు…. అద్దెలెట్లా కట్టేది
ఆర్టీసీ సమ్మె కేవలం ఆర్టీసీలో పనిచేసే కార్మికులకే కాదు. పరోక్షంగా చాలామందికి నష్టం జరుగుతుంది. బస్ స్టేషన్లలో ఆర్టీసీకి చెందిన స్టాల్స్ ఉన్నాయి. వీరంతా కూడా బస్సులు [more]
ఆర్టీసీ సమ్మె కేవలం ఆర్టీసీలో పనిచేసే కార్మికులకే కాదు. పరోక్షంగా చాలామందికి నష్టం జరుగుతుంది. బస్ స్టేషన్లలో ఆర్టీసీకి చెందిన స్టాల్స్ ఉన్నాయి. వీరంతా కూడా బస్సులు [more]
ఆర్టీసీ సమ్మె కేవలం ఆర్టీసీలో పనిచేసే కార్మికులకే కాదు. పరోక్షంగా చాలామందికి నష్టం జరుగుతుంది. బస్ స్టేషన్లలో ఆర్టీసీకి చెందిన స్టాల్స్ ఉన్నాయి. వీరంతా కూడా బస్సులు నడుస్తేనే ఉపాధి పొందుతారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన బస్ స్టేషన్లలో ఉన్న దుకాణాలను ఆర్టీసీ యంత్రాంగం టెండర్ల ద్వారా దుకాణాలను వేలం వేస్తారు. ఈ దుకాణ దారులంతా కూడా ప్రయాణికులపైనే ఆధారముంటుంది.
ప్రయాణాలు బంద్…
హైదరాబాద్ లోని బస్ స్టేషన్ల నుంచి నిత్యం రెండు లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. కేవలం మహాత్మా గాంధీ బస్ స్టేషన్లోనే సుమారు లక్ష మంది పై చిలుకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఇక్కడి నుంచి ప్రతి రోజు 3వేల పై చిలుకు బస్సులు నడిచేవి. 15రోజులుగా ఆర్టీసీకార్మికులు సమ్మె చేపట్టడంతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రోజుకు పదివేల మంది ప్రయాణికులు కూడా రావడం లేదు. అరకొర బస్సులే ఉండడంతో చాలామంది ప్రయాణాలను మానుకుంటున్నారు.
మాఫీ చేయండి….
బస్ స్టేషన్లలోని స్టాల్స్ కు భారీ మొత్తంలో అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది నిర్వాహకులు. ఒక్క స్టాల్ కు నెలకు 30 వేల నుంచి మొదలు కొని రెండు లక్షల వరకు అద్దెలున్నాయి. (విస్తీర్ణాన్ని బట్టి ధరలు నిర్ణయిస్తారు) డార్మిటరీలు, రెస్ట్ రూంలు, హోటళ్లు, టీ స్టాల్స్, పేపర్ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు ఇలా అనేక దుకాణాలున్నాయి. ప్రస్తుతం ప్రయాణికుల రాకపోకలు లేకపోవడంతో ఈ దుకాణదారులకు గిరాకీలు లేవు. దీంతో ఈ నెల అద్దెలు ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నారు. వేల రూపాయల అద్దెలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నెల కట్టకపోతే 3 శాతంవడ్డీ కూడా ఆర్టీసీకి కట్టాల్సి ఉంటుంది. సో సమ్మె ఉన్నన్ని రోజులు తమకు అద్దె మాఫీ చేయాలని దుకాణదారులు కోరుతున్నారు.