ఓడిపోయా నా డబ్బు నాకిచ్చేయండి …!!?
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓటర్లకు విసిరే తాయిలాలు అన్ని ఇన్ని కావు. ఎన్నోరకాల ప్రలోభాలకు గురిచేసినా చివరికి ఓడిపోతే ఆ అభ్యర్థులు పడే బాధ వర్ణానాతీతమే. ఓటర్లను [more]
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓటర్లకు విసిరే తాయిలాలు అన్ని ఇన్ని కావు. ఎన్నోరకాల ప్రలోభాలకు గురిచేసినా చివరికి ఓడిపోతే ఆ అభ్యర్థులు పడే బాధ వర్ణానాతీతమే. ఓటర్లను [more]
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓటర్లకు విసిరే తాయిలాలు అన్ని ఇన్ని కావు. ఎన్నోరకాల ప్రలోభాలకు గురిచేసినా చివరికి ఓడిపోతే ఆ అభ్యర్థులు పడే బాధ వర్ణానాతీతమే. ఓటర్లను చూస్తే చాలు మాంటెత్తుకొస్తుంది. డబ్బులు తీసుకుని, ఇచ్చినవన్నీ హాయిగా పుచ్చుకుని ఓటు మాత్రం ప్రత్యర్థికి వేస్తే రాదా మరి. ఇలా ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎమ్యెల్యే, ఎంపి ఎన్నికల్లోనే కాదు పంచాయితీ ఎన్నికల్లోనూ ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా పంచాయితీ ఎన్నికల్లో ఒక వార్డ్ సభ్యుడు వ్యవహారం నెట్టింట్లో వైరల్ గా మారింది.
నాది నాకిచ్చేయాలంటున్నాడు …
పంచాయతీ ఎన్నికల్లో వార్డ్ సభ్యుడు గా నిలబడి ఓడిపోయారు ఒక నేత. ఇక్కడిదాకా బానే వుంది. ఆ ఎన్నికల్లో ఓట్లేస్తారని డబ్బిస్తే తీసుకుని జనం ప్రత్యర్థిని గెలిపించారు. దాంతో నా డబ్బు నాకిచ్చేయండి అంటూ జనం చుట్టూ ఓడిపోయిన అభ్యర్థి తిరగడం మొదలు పెట్టాడు. ఈ వ్యవహారాన్ని ఒకరు సెల్ ఫోన్ లో చిత్రీకరించడం దాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం అది చూసిన నెటిజనానికి నోట మాట రావడం లేదు… నవ్వులు తప్ప. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి సిత్రాలు ఇంకా పెరిగే అవకాశాలు వుంటాయని జోకులపై జోకులు నడుస్తున్నాయి. ఇదండీ సంగతి.