తాను ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రభోదనందస్వామి స్పష్టం చేశారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలోనే పత్యక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తామని చెప్పడం విశేషం. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమంలోని భక్తులకు, పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులకు మధ్య ఇటీవల ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. జేసీ దివాకర్ రెడ్డి ప్రభోదానంద ఆశ్రమాన్ని ఖాళీ చేయించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభోదానందస్వామి జేసీ సోదరులు తమపై కక్ష కట్టారన్నారు. వాళ్లు అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే తనపైనా, తన ఆశ్రమంపైనా జేసీ సోదరులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాను దేవుడిని కాదని, ఆధ్యాత్మిక ప్రభోదనలను మాత్రమే చేస్తానని చెప్పారు. తన ప్రసంగాలను కట్ చేసి సోషల్ మీడియాలో జేసీ వర్గం దుష్ప్రచారానికి దిగిందని, తన ఆశ్రమాన్నికబ్జా చేయాలన్న తలంపుతో వారు ఉన్నట్లుందని, అది జరగని పని అని స్వామీజీ తేల్చి చెప్పారు.