నేను బంటునే కాదు.. పోరాడే సైనికుడిని

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన పార్టీని దెబ్బతీసేందుకు రకరకాల తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. టీడీపీ – జనసేన పొత్తు [more]

Update: 2019-02-22 11:18 GMT

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన పార్టీని దెబ్బతీసేందుకు రకరకాల తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందని ఒక పత్రికలో వచ్చిన కథనంపై పవన్ ట్విట్టర్ లో స్పందించారు. తాను వైసీపీ, బీజేపీతో కలిశానని టీడీపీ అంటోందని, టీడీపీ పార్ట్ నర్ నని వైసీపీ ఇప్పుడు ఆరోపిస్తోందని, రాజ్ భవన్ లో కేసీఆర్ ను కలిస్తే తాను వైసీపీ, టీఆర్ఎస్ తో ఉన్నానని టీడీపీ అంటోందన్నారు. ప్రజల కోసం నిబద్ధతతో పనిచేస్తే ఇటువంటివి తప్పుడు ప్రచారం తప్పదన్నారు.

టీడీపీ, వైసీపీ చేతులు కలిపాయి…

జనసేన పార్టీ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు టీడీపీ, వైసీపీ చేతులు కలిపి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తనకు ఓ రాజకీయ విశ్లేషకులు చెప్పారని పేర్కొన్నారు. తాను స్వతంత్రంగా ఉండకుండా ఈ పార్టీలలో ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వాలనేది వారి ఉద్దేశ్యమని ఆయన ఆరోపించారు. తాను రాజకీయ చదరంగంలో చిన్న బంటునే కావచ్చని, కానీ పోరాడే తత్వం ఉన్న సైనికుడిని అని ఆ పార్టీలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఇవన్నీ చూస్తే వీరితో పోరాడేందుకు తనకూ ఒక పేపర్, టీవీ కావాలనిపిస్తోందన్నారు. కానీ, పత్రిక, ఛానల్ లేకుండానే బీఎస్పీని స్థాపించిన కాన్షిరాం తనకు స్ఫూర్తి అన్నారు. జనసైనికులే తన ఛానళ్లు, పత్రికలని స్పష్టం చేశారు.

Tags:    

Similar News