సీక్రెట్స్ చెప్పేస్తున్న పవన్ ...?

Update: 2018-09-27 06:30 GMT

ఆఫ్ ది రికార్డ్ లో లక్షా తొంబై నడుస్తాయి. అవన్నీ జనానికి తెలిస్తే పరువు పోతుంది. కొత్త రాజకీయాలకు తెరతీసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు గతంలో టిడిపి, జనసేన స్నేహం సందర్భంగా నడిచిన తంతంగం ఒక్కోటిగా సభల్లో విప్పి చెబుతున్నారు. దాంతో టిడిపి కి వున్న కాస్త పరువు గోదావరిలో కలిపేస్తున్నారు జనసేనాని. 2014 ఎన్నికల్లో ఫలితం రాని సందర్భంలో తనతో డిన్నర్ కి వచ్చిన పెదబాబు, చినబాబు లకు టిడిపి అధికారంలోకి రాకుండా జగన్ అధికారంలోకి వస్తే, జనసేన అండగా నిలవాలని అభ్యర్ధించారని వైసిపి అధినేత అంటే వారికి అంత భయమంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

సోషల్ మీడియా లో సెటైర్లు పేలుతున్నాయి ...

పవన్ పశ్చిమ గోదావరి టూర్ లో చేసిన తాజా వ్యాఖ్యలను వైసిపి సోషల్ మీడియా విభాగం చక్కగా వాడేస్తుంది. తమ అధినేత అంటే తెలుగుదేశం అధినేత కు ఎంత భయమో పవన్ చెప్పింది వినండి అంటూ పోస్ట్ లు ఫేస్ బుక్, వాట్స్ అప్ లలో వెల్లువెత్తుతున్నాయి. టిడిపి, కాంగ్రెస్, బిజెపి, జనసేన అంతా కలిసి ఒక్కడిపై పోరాడాయి అంటూ వైఎస్ జగన్ ను బాహుబలిగా కీర్తించేస్తూ పోస్ట్ లు కామెంట్లు సాగిపోతున్నాయి.

పవన్ వ్యాఖ్యలపై టిడిపి ఆచితూచి ...

పవన్ కళ్యాణ్ పై పదునైన విమర్శలకు టిడిపి స్వస్తి పలికింది. వైసీపీతో పాటు రొటీన్ గా విమర్శిస్తూ ఎక్కువ సమయం జగన్ పై దాడికే సమయం కేటాయిస్తుంది. రేపటి రోజున మెజారిటీ తక్కువ వస్తే ఎవరితోనైనా జత కలవాలిసిన్ పరిస్థితి ఉంటుందన్న ముందు చూపుతో జనసేన ను మరీ దూరం చేసుకోరాదన్న వ్యూహంలో పసుపు పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుందంటున్నారు విశ్లేషకులు. అయితే పవన్ మాత్రం రోజు రోజుకు టిడిపి పై విమర్శలు, ఆరోపణల దాడి తీవ్రం చేయడం విశేషం.

Similar News