జనసేన కవాతుకు పది లక్షల మంది వచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కవాతుకు ఇంతమంది జనం వచ్చింది తనను చూడటానికి కాదని, ప్రభుత్వ పనితీరుపై విసుగు చెందే రోడ్లపైకి వచ్చారని పవన్ అన్నారు. ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చుచేస్తే చూస్తూ ఊరుకోబోమని, జనం చొక్కాలు పట్టుకుంటారని పవన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పనితీరును మార్చుకోవాలన్నారు. కవాతు జనసేన బలప్రదర్శన కాదని, ప్రభుత్వం పనితీరును మార్చుకోవడం కోసమేనని పవన్ అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తాను అధికారంలోకి వస్తే అది చేస్తా, ఇది చేస్తానని హామీలు ఇస్తున్నారని, మరి వైసీపీ అధికారంలోకి రాకుంటే ఏం చేస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రేపు శ్రీకాకుళం జిల్లాలో వరద బాధితులను పరామర్శిస్తానని చెప్పారు.