ముఖ్యమంత్రి అవ్వాలంటే అందరి వాడుగా ఉండాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష‌్ణుడు అభిప్రాయపడ్డారు. ఆయనకు పవన్ కు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. గతంలో మెగాస్టార్ అందరివాడుగా వచ్చి కొందరివాడిగానే మిగిలారన్నారు. పవన్ ప్రచారం చేసిన పాలకొల్లులోనూ చిరంజీవి ఓడిపోయారన్నారు. ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలుపునకు దోహదపడ్డారన్నారు. ఆ తర్వాత మంత్రి పదవుల కోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారన్నారు. ఇప్పుడు పవన్ కూడా ఎవరిని గెలిపించడానికి పార్టీ పెట్టారో చెప్పాలని యనమల నిలదీశారు.
జగన్ ఆస్తుల విషయంలోనూ.....
తన పార్టీని ఎందులో కలుపుతారో కూడా పవన్ స్పష్టత ఇస్తే బాగుంటుందని యనమల ఎద్దేవా చేశారు. సందుల్లో మీటింగ్ లు పెట్టి టీడీపీని తిడితే జనం హర్షించరని, అందరివాడు కాబట్టే చంద్రబాబునాయుడు 14 ఏళ్లు సీఎంగా ఉన్నారని యనమల తెలిపారు. పవన్ కల్యాణ్ వి లాలూచీ రాజకీయాలన్నారు. ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడతారన్నారు. జగన్ అక్రమ ఆస్తుల గురించి దేవుడికే తెలియారంటారని, జగన్ ఆస్తులను ఈడీ సీజ్ చేసిన విషయం పవన్ కు తెలియదా? అని యనమల ప్రశ్నించారు.