Revanth Reddy : కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఇక అంతే

ఈసారి గెలిచేది మనమేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Update: 2023-10-31 12:51 GMT

ఈసారి గెలిచేది మనమేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇందిరాగాంధీ వర్ధంతి రోజున కొల్లాపూర్ లో సభ జరుపుకుంటున్నామని తెలిపారు. కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే తెలంగాణ ప్రజల ఆస్తిని ఆయన బంధువులకు దోచి పెడతారన్నారు. 119 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులకు బీ ఫారం ఇచ్చే బాధ్యత పాలమూరు బిడ్డ మీద కాంగ్రెస్ హైకమాండ్ పెట్టిందని, అందుకనే ఈ జిల్లాలో మీరు కాంగ్రెస్ ను ఆదరించాలని కోరారు. చస్తే ఇక్కడి మట్టిలో కలిసే వాడనని, అందుకే ఆదరించండి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు ఆరు గ్యారంటీలను డిసెంబరు 9న అమలు చేస్తామని చెప్పారు. దుబ్బాకలో దాడి చేసింది కాంగ్రెస్ వాళ్లంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ డ్రామాలు అని రేవంత్ అన్నారు. జగదీశ్వరరావుకు పార్టీ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారుక.

కాపలా కుక్క అంటూ...
కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభకు కాంగ్రెస్ సభకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తొలుత ప్రియాంక గాంధీ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో ఆమె హాజరు కాలేదు. దీంతో ప్రియాంకకు బదులుగా రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాజ్యసభ టిక్కెట్లను నీ ఇంట్లో మనుషులకు ఇచ్చుకున్నావన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్క అని చెప్పిన కేసీఆర్ నీటిపారుదల ప్రాజెక్టులో అవినీతి చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారని ఆయన మండి పడ్డారు.
రాష్ట్ర గతిని మార్చే సభ...
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రేపు రాష్ట్ర గతిని మార్చే సభ ఇది అని అన్నారు. రేపు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని అన్నారు. దశాబ్దకాలం నుంచి కృష్ణా నది నుంచి ఒక్క చుక్క నీరు కూడా పారలేదని అన్నారు. నాడు కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులే తప్ప కొత్తగా కట్టింది ఏమీ లేదన్నారు. అందుకే కృష్ణా నదిలో కారు పార్టీని ముంచుదామని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మల్లు భట్టి విక్రమార్క కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.






Tags:    

Similar News