సాధారణంగా డీజిల్ కంటే పెట్రోల్ కొంత ఎక్కువగా ఉంటుంది. కానీ, ఒడిషాలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అక్కడ పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర పెరిగిపోయింది. ప్రస్తుతం ఒడిషాలోని భువనేశ్వర్ లో లీటరు డీజిల్ ధర రూ.80.78 కాగా లీటరు పెట్రోల్ ధర రూ.80.65గా నమోదైంది. సాధారణంగా పెట్రోల్ కంటే డీజిల్ పై పన్నుల భారం, డీలర్ కమిషన్, బేస్ ధర తక్కువగా ఉండటం వల్ల పెట్రోల్ కంటే డీజిల్ ధరలు తక్కువగా ఉంటాయి. కానీ ఇటీవల డీజిల్ బేస్ ధర రూ.5 పెరగడం, పెట్రోల్ కి సమానంగా డీజిల్ పై కూడా 26 శాతం వ్యాట్ విధిస్తుండటంతో డీజిల్ ధర పెట్రోల్ కంటే ఎక్కువైంది. డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.