కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న పెథాయ్ తుఫాను కాకినాడ - యానాం మధ్య తీరం దాటింది. దీంతో గంటకు 80 - 100 కిలోమీటర్ల భారీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాను ప్రభావంతో కొనసీమ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తుఫాను ప్రభావం కాకినాడలో మరో 2 గంటల పాటు తీవ్రంగా ఉండనుంది. మరో 24 గంటల పాటు తుఫాను వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తుఫాను కారణంగా 47 ప్యాసింజర్, 3 ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇక విశాఖపట్నం విమానాశ్రయానికి రావాల్సిన 14 విమానాలు రాకపోవడంతో 700 మంది ప్రయాణికులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు.