నేడు పోలవరం ప్రాజెక్టుపై..?

పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సమావేశం నేడు హైదరాబాద్ లో జరగనుది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పోలవరం నిధుల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో [more]

Update: 2020-11-02 02:24 GMT

పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సమావేశం నేడు హైదరాబాద్ లో జరగనుది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పోలవరం నిధుల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగే ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టు అధారిటీ సర్వసభ్య సమావేశంలో నిధుల కోత విషయంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కావడంతో ఏపీ ప్రభుత్వం పునరావసంతో పాటుపూర్తి స్థాయి నిధులను విడుదల చేయాలని అథారిటీని కోరనుంది. దీంతో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Tags:    

Similar News