ఆరోజు మద్యం తాగి రోడ్డెక్కితే…?

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబులకు పోలీసులు షాక్ ఇస్తున్నారు.. మద్యం తాగి పోలీసుల చిక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. దీనికి తోడుగా వారి [more]

Update: 2020-12-28 01:53 GMT

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబులకు పోలీసులు షాక్ ఇస్తున్నారు.. మద్యం తాగి పోలీసుల చిక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. దీనికి తోడుగా వారి పనిచేస్తున్న కార్యాలయ మేనేజ్ మెంట్ కూడా సమాచారం ఇస్తామని తెలిపారు. దీంతోపాటుగా ప్రభుత్వ ఉద్యోగానికి కనుక వీళ్లు అప్లై చేసినట్లయితే అక్కడ కూడా సమాచారాన్ని చేరవేసే వేస్తామని పోలీసులు చెబుతున్నారు.. మద్యం తాగి ఎవరు కూడా వాహనాన్ని నడవద్దని అలా చేసిన పక్షంలో వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు చెప్తున్నారు.. ఇప్పటికే హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేల సంఖ్యలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో కొన్ని వందల సంఖ్యలో డ్రైవింగ్ లైసెన్స్ లను సస్పెండ్ చేయించారు. అయితే న్యూ ఇయర్ వేడుకలకు ఇప్పటికే పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసు ఆదేశాలను పట్టించుకోకుండా వేడుకలు చేసుకుని మందు తాగి పోలీసుల దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:    

Similar News