డబ్బులు ఊరికే పోలేదు

తమిళనాడు తిరుచ్చిలోని లలితా జువెల్లరీ షో రూం కేసులో దొంగలను పోలీసులు పట్టుకున్నారు. అయితే వారి వద్ద నుంచి ఇంకా బంగారు ఆభరణాలు రికవరీ చేయలేదు. మొత్తం [more]

Update: 2019-10-03 08:32 GMT

తమిళనాడు తిరుచ్చిలోని లలితా జువెల్లరీ షో రూం కేసులో దొంగలను పోలీసులు పట్టుకున్నారు. అయితే వారి వద్ద నుంచి ఇంకా బంగారు ఆభరణాలు రికవరీ చేయలేదు. మొత్తం 13 కోట్ల రూపాయల విలువచేసే బంగారు, వజ్రాభరణాల ను బుధవారం తెల్లవారుజామున షో రూం గోడకు కన్నెం వేసి అందులో నుంచి దూరి ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. దొంగలు పడ్డ 24 గంటల్లోనే పోలీసు అధికారులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఇందులో ఐదుగురు దొంగల పాత్ర ఉన్నట్లు తేలింది. వారిని అదుపులోకి తీసుకున్నారు.

తీగ లాగుతున్నారు….

పట్టుబడ్డ అయిదుగురు దొంగలు గతంలో దుప్పట్ల వ్యాపారం చేసే వారని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు వెళ్ళగా దొంగలు పారిపోయే ప్రయత్నం చేశారు. వీరు ఒక లాడ్జిలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులు వచ్చారనే విషయం తెలుసుకున్న దొంగలు లాడ్జి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక్క దొంగ తలకు తీవ్ర గాయమైంది. ఈ దొంగల ముఠా మహారాష్ట్ర కేరళ కు చెందిన వారుగా గుర్తించారు. ఈ ముఠాలోని వారెవరైనా లలితా జువెల్లరీ దుకాణాల్లో పనిచేశారా లేక అందులో పనిచేసే ఉద్యోగులతో వీరికి సంబంధాలున్నాయానని పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

Tags:    

Similar News