కారు లో రెండుగంటల హైడ్రామా.. షర్మిల అరెస్ట్
ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు రెండు గంటల హైడ్రామాకు తెరపడింది
ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు రెండు గంటల హైడ్రామాకు తెరపడింది. కారు అద్దాలను లాక్ చేసుకుని లోపలే కూర్చుని ఉన్న షర్మిలను బయటకు రావాలని పోలీసు అధికారులు పదే పదే కోరారు. అయితే కారు నుంచి దిగకపోవడంతో లాక్ తీసేవారిని ప్రత్యేకంగా రప్పించి కారు డోర్ ను తీశారు. సోమాజిగూడ నుంచి వైఎస్ షర్మిల కారును క్రేన్ ద్వారా ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు.
డోర్ ఓపెన్ చేసి...
షర్మిల కారులోనే ఉండగా పోలీసులు క్రేన్ సాయంతో తరలించారు.అక్కడ కూడా కారు నుంచి షర్మిల దిగలేదు. కారు డోర్ ను ఓపెన్ చేసిన అనంతరం అనంతరం మహిళ పోలీసులు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల మండి పడ్డారు. పోలీసులు గూండాల్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బందిపోట్ల రాష్ట్ర సమితిగా తయారైందని అన్నారు. షర్మిలతో పాటు వైఎస్సార్టీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.