మూడో సారి ముఖ్యమంత్రిగా
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామా చేశారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుంది.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుంది. నిన్న రాత్రే గవర్నర్ ను బీజేపీ నేత ఫడ్నవిస్ కలిశారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈరోజు జరగాల్సిన బలపరీక్ష వాయిదా పడింది. గోవాలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు మరికొంత కాలం అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు.
థాక్రే రాజీనామా తో...
నిన్న రాత్రి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు. గవర్నర్ ను కలసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం గవర్నర్ ను కలసిన ఫడ్నవిస్ న తమకు పూర్తి స్థాయి మెజారిటీ ఉందని అన్నారు. దీంతో ఫడ్నవిస్ శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన బలాన్ని నిరూపించుకుంటారు ఫడ్నవిస్. మూడోసారి ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రేపు ముఖ్యమంత్రిగా..
నిన్న రాత్రి సుప్రీంకోర్టు తీర్పు వరకూ వేచి చూసిన ఉద్ధవ్ థాక్రే తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవిని కూడా ఆయన వదులుకున్నారు. సభలో మెజారిటీ నిరూపించుకోవడం కష్టమని భావించి ఉద్ధవ్ థాక్రే తనంతట తానే పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఫడ్నవిస్ బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. ఆయనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని శుక్రవారం చేపట్టనున్నారు. తర్వాత శాసనసభలో తన బలాన్ని నిరూపించుకుంటారు.