విలీనం వదులుకోవాల్సిందేనా?

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదోపవాదాలు కొనసాగాయి. మళ్లీ రేపు హైకోర్టు విచారించనుంది.  24రోజులుగా సమ్మె చేస్తున్నా ఇటు ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం [more]

Update: 2019-10-28 12:10 GMT

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదోపవాదాలు కొనసాగాయి. మళ్లీ రేపు హైకోర్టు విచారించనుంది. 24రోజులుగా సమ్మె చేస్తున్నా ఇటు ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. చివరికి హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. విలీనం పై కార్మికులను, చర్చలు జరపనందుకు ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు చీవాట్లు పెట్టింది.

మిగితా వాటిపై ఏం చేశారు..?

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణ మళ్లీ రేపు జరుగనుంది. చర్చలకు జేఏసీ నాయకులను పిలిస్తే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చ జరపాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామంటే వినలేదనీ, చర్చలు జరపకుండానే కార్మిక నేతలు బయటకు వెళ్లిపోయారని చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. విలీనం డిమాండ్‌కు పట్టుబట్టకుండా మిగతా డిమాండ్లపై చర్చ జరపవచ్చు కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

విలీనం సాధ్యమేనా….

విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగతా వాటిపై చర్చించాలని కార్మిక సంఘాలకు సూచించింది. మొత్తం 45 డిమాండ్లలో ఆర్టీసీ సంస్థపై ఆర్థికభారం పడని డిమాండ్లపై చర్చ జరగాలని, మొదట 21డిమాండ్లపై చర్చ జరిగితే కార్మికుల్లో కొంత ఆత్మస్థైర్యం కలుగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఓవర్‌ నైట్‌ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎలా సాధ్యమవుతుందని హైకోర్టు జేఏసీ నేతలను ప్రశ్నించింది. విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగతా వాటిపై చర్చ జరపాలని, లేకపోతే సమ్మె విషయంలో ప్రతిష్టంభన కొనసాగి.. ఇటు కార్మికులు, అటు ప్రజలు ఇబ్బంది పడతారని న్యాయస్థానం పేర్కొంది.

వదులుకుంటారా…?

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యపడదని ప్రభుత్వం ఎన్నోసార్లు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భూగోళం ఉన్నంతవరకు విలీనం మాటే ఉండదని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు హైకోర్టు కూడా విలీనం రాత్రికి రాత్రి ఎలా అవుతుందని ప్రశ్నించింది. దీంతో ప్రస్తుతం కార్మికులు వారు మొట్టమొదటి డిమాండ్ విలీనాన్ని వదులుకోవాల్సిందేననే సంకేతాలు కనిపిస్తున్నాయి.

 

 

Tags:    

Similar News