Andhra : ఏపీలో పవర్ కట్… నాలుగు గంటలు

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. సాయంత్రం 6 గంటల నుంచి పది గంటల వరకూ విద్యుత్ కోతను విధించాలని నిర్ణయించారు. గ్రామాల్లో ఈ కోత వేళలను [more]

Update: 2021-10-13 04:49 GMT

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. సాయంత్రం 6 గంటల నుంచి పది గంటల వరకూ విద్యుత్ కోతను విధించాలని నిర్ణయించారు. గ్రామాల్లో ఈ కోత వేళలను పాటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టణాలు, నగరాల్లో మాత్రం విద్యుత్తు కోత ఉండదని తెలిపారు. పీక్ అవర్స్ లోనే విద్యుత్ కోతను గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్లు ఇంధన కార్యదర్శి శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.

బొగ్గు కొరత కారణంగానే….

దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఉన్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ ప్రజలు ఏసీలు ఆఫ్ చేయాలని ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. బొగ్గు కొరతను అధిగమించే వరకూ ఈ కోతలు కొనసాగనున్నాయి.

Tags:    

Similar News