కష్టాల్లో కేఏ పాల్
కేఏ పాల్ కు కష్టాలు తప్పేట్టు లేదు. తన సొదరుడు హత్య కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న కేఏ పాల్ కు కోర్టు నాన్ [more]
కేఏ పాల్ కు కష్టాలు తప్పేట్టు లేదు. తన సొదరుడు హత్య కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న కేఏ పాల్ కు కోర్టు నాన్ [more]
కేఏ పాల్ కు కష్టాలు తప్పేట్టు లేదు. తన సొదరుడు హత్య కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న కేఏ పాల్ కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు గా కొనసాగుతున్న కేఏ పాల్‌పై మహబూబ్ నగర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేఏ పాల్ సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా వున్నారు. హత్య కేసు మహబూబ్‌నగర్ కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసు విచారణకు మిగతా నిందితులు కోర్టుకు హాజరైనప్పటికీ కేఏ పాల్ హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. 2009 సంవత్సరం జనవరి 30 తేదిన డేవిడ్ రాజు మృతదేహం ఒక కారులో కనిపించింది. అడ్డాకులు మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామ సమీపంలో నిలిపి వుంచిన కారులో డేవిడ్ రాజు మృతదేహాన్ని స్దానికులు కనుగొన్నారు. ముందుగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి తరువాత డేవిడ్ రాజుగా గుర్తించారు. ఈ కేసులో కేఏ పాల్ పైన ఆరోపణ లు వచ్చాయి. దీంతో పోలీసులు కేఏ పాల్ తో పాటుగా పలువురిపైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.