క్లిష్ట సమయంలోనూ నిలదొక్కుకున్నాం

కోవిడ్ వంటి క్లిష్ట సమయంలోనూ భారత్ అన్నింటినీ అధిగమించి నిలదొక్కుకుందని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అన్నారు.

Update: 2022-01-31 06:18 GMT

కోవిడ్ వంటి క్లిష్ట సమయంలోనూ భారత్ అన్నింటినీ అధిగమించి నిలదొక్కుకుందని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ాయన ప్రసంగించారు. కోవిడ్ సమయంలో అన్ని వర్గాలను ఆదుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేసిందని, దేశంలోనే మూడు వ్యాక్సిన్లు తయారయ్యాయని రాష్ట్రపతి గుర్తు చేశారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. జలజీవన్ మిషన్ తో గ్రామాలకు తాగునీరు అందించే పథకం విజయవంతమయిందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార వ్యవస్థ భారత్ అని రామ్ నాధ్ కోవింద్ అన్నారు.

అన్ని రంగాలను....
ఫార్మా పరిశ్రమను విస్తరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో దేశంలో గృహనిర్మాణాలు ఊపందుకున్నాయని రాష్ట్రపతి తెలిపారు. ఇక వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో మహిళల పాత్ర కీలకమని చెప్పారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కోసం ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని చెప్పారు. పద్మ పురస్కారాలను సామాన్యుల వరకూ తీసుకెళ్లిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని రామ్ నాధ్ కోవింద్ చెప్పారు.
రైతుల కోసం....
రైతుల కోసం అనేక పథకాలను ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. సన్నకారు రైతుల కోసం ఫసల్ బీమా పథకం ఉపయోగంగా ఉంటుందని రాష్ట్రపతి చెప్పారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు నగదు బదిలీ పథకం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రామ్ నాధ్ కోవింద్ చెప్పారు. నదుల అనుసంధానం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తుందన్నారు. ముద్ర ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణసదుపాయం కల్పిస్తుందని రాష్ట్రపతి తెలిపారు.


Tags:    

Similar News