కుటుంబ పాలన అంటూ...
కుటుంబ పాలన చేసే వారికి సమాజం అభివృద్ధి పట్టదని మోదీ అన్నారు. అవినీతిపరులుపై చర్యలు చేపట్టాలా?వద్దా అని ప్రశ్నించారు. తనపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమవుతున్నాయని అన్నారు. గడిచిన 9 ఏళ్లలో 11 కోట్ల మంది మహిళలకు లబ్ది కలిగిందన్నారు. అవినీతిపరులపై పోరాటానికి ప్రజల సహకారం కావాలని ఆయన కోరారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. అవినీతిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరి గుప్పిట్లోనే తెలంగాణ మగ్గిపోతుందన్నారు. దీని నుంచి తెలంగాణను బయటపడేలాని ప్రజలకు పిలుపునిచ్చారు.
కేంద్రం సహకరించడం లేదు...
ఈ సందర్భంగా నాలుగు జాతీయ రహదారులకు మోదీ శంకుస్థాపన చేశారు. 11 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి తిరుపతి వెంకన్న వరకూ వందేభారత్ రైలును వేశామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్యను కూడా పెంచామని తెలిపారు. రైల్వే వ్యవస్థను మెరుగు పర్చడం వల్ల తెలంగాణ జిల్లాల ప్రజలకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. గడిచిన 9 ఏళ్లలో 70 కిలోమీటర్ల మెట్రో నెట్ వర్క్‌ను ప్రారంభించామని తెలిపారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. తెలంగాణ ఏర్పాటు, నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం మరిచిపోలేదని, తెలంగాణను అభివృద్ధి చేసే అదృష్టం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు.
అనేక అభివృద్ధి పనులను...
దేశ అభివృద్ధిలో తెలంగాణను భాగస్వామిని చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ జాతీయ రహదారులకు 1.04 లక్షల కోట్లు కేటాయించామని తెలిపారు. వరంగల్ లో మెగా టెక్స్‌టైల్స్ పార్కును కేటాయించామని, దీనివల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుందని మోదీ తెలిపారు. బీబీనగర్ లో ప్రతిష్టాత్మకంగా ఎయిమ్స్ ను నిర్మిస్తున్నామని తెలిపారు. కల్వకుర్తి - కొల్హాపూర్ జాతీయ రహదారి నిర్మాణాన్ని చేపట్టామని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్ర పూర్తిగా సహకరించకపోవడం వల్ల అనేక ప్రాజెక్టులు అమలులో జాప్యం జరుగుతుందని మోదీ అన్నారు. విద్యపై కూడా పెట్టుబడులు పెంచుతున్నామని తెలిపారు.