ఏపీకి అంబానీ ప్రామిస్
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు మంచి ప్రదేశమని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు మంచి ప్రదేశమని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ అన్నారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో తొలిరోజు సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్, ప్రధాని మోదీల ముందు చూపుతో ఇండియాతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలోనే ఏపీ పారిశ్రామిక రంగంలో ముందు ఉంటుందని అంబానీ తెలిపారు. విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో తాను భాగస్వామినయిందుకు సంతోషంగా ఉందని అంబానీ అభిప్రాయపడ్డారు.
అనేక వనరులు...
తిరుపతి, విశాఖతో పాటు అద్భుతమైన సహజ వనరులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అంబానీ అన్నారు. ఎన్నో రంగాల్లో నిపుణులు ఏపీ నుంచే ఉన్నారన్నారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఏపీ వైపు ఆశాజనకంగా చూస్తున్నారన్నారు. తమ రిలయన్స్ సంస్థలోనూ ఎందరో ఉన్నతాధికారులు ఏపీ నుంచి ఉన్నారన్నారు. ఆయిల్ గ్యాస్ రంగంలో ఆంధ్రప్రదేశ్ లో మంచి పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. రిలయన్స్ దేశానికి ఏపీకి చాలా అవసరమని అన్నారు.
పెట్టుబడులు కొనసాగించేందుకు...
తాము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు కొనసాగిస్తామని అంబానీ చెప్పారు. అంతకు ముందు జేఎస్‌డబ్ల్యూ గ్రూపు ఎండీజ జిందాల్ మాట్లాడుతూ కృష్ణపట్నం ఓడరేవులో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం పదివేల కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించారు. అతిపెద్ద సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఏపీ ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి ప్రభుత్వ సహకారాలు కియా అభివృద్ధికి దోహదపడుతున్నాయని కియా ఇండియా తరుపున సదస్సులో పాల్గొన్న కబ్ డోంగి లీ అన్నారు.