పురంధేశ్వరి అవుట్‌!

ఆంధ్ర ప్రదేశ్‌ భాజపా అధ్యక్ష స్థానం నుంచి దగ్గుబాటి పురంధేశ్వరికి ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. మరో నాలుగు నెలల్లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో తన పరిస్థితిని మెరుగు పరుచుకోవడంపై కమలం పార్టీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పురంధేశ్వరిని వదిలించుకోవాలని భాజపా భావిస్తోందట.

Update: 2023-12-22 03:12 GMT

Purandheswari

తెలంగాణకు కూడా కొత్త అధ్యక్షుడు

ఆంధ్ర ప్రదేశ్‌ భాజపా అధ్యక్ష స్థానం నుంచి దగ్గుబాటి పురంధేశ్వరికి ఉద్వాసన పలకనున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాదానం వస్తోంది ఆ పార్టీ ఢిల్లీ వర్గాల నుంచి. మరో నాలుగు నెలల్లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో తన పరిస్థితిని మెరుగు పరుచుకోవడంపై కమలం పార్టీ దృష్టి పెట్టింది. తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పురంధేశ్వరిని అధ్యక్ష స్థానం నుంచి తప్పించాలని భాజపా భావిస్తోందట.

దాదాపు ఆర్నెళ్ల కిందట పురంధేశ్వరిని ఆంధ్ర ప్రదేశ్‌ అధ్యక్షురాలిగా నియమించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఆమెకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆమె సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలను తమ పార్టీలకు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో పార్టీ పటిష్టానికి బాటలు వేయాలని అధిష్టానం అనుకుంది. ఆమె వ్యవహార శైలి తెలుగుదేశానికి మద్దతుగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

తెలుగుదేశం అడుగు జాడల్లో నడుస్తూ, చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆమెపై విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు అరెస్ట్‌ ఢల్లీి పెద్దలతో ఆమె లోకేష్‌ను కలపడానికి తీవ్రంగా ప్రయత్నించడం కూడా వివాదాస్పదమైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు కొత్త అధ్యక్షుడి నేతృత్వంలో వెళ్లాలని భాజపా నాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణలో కూడా పార్టీ అధ్యక్ష స్థానానికి కొత్త వ్యక్తి రాబోతున్నారు. మళ్లీ బండి సంజయ్‌కే పార్టీ పగ్గాలు అప్పగించాలని మోదీ, షా జోడీ యోచిస్తున్నారు. త్వరలోనే ఈ విషయమై అధికారికంగా సమాచారం అందనుంది.

Tags:    

Similar News