తగ్గేదే లే అంటున్న గణేషుడు.. నవరాత్రోత్సవాల్లో టాలీవుడ్ హవా

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పలుచోట్ల అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల పాత్రలకు సంబంధించిన..

Update: 2022-08-31 04:12 GMT

2022.. టాలీవుడ్ కి బాగా కలిసొచ్చిందని చెప్పాలి. పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ తో పాటు.. బాలీవుడ్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టాయి. ప్రతి ఏటా గణేష్ నవరాత్రుల్లో ఆ ఏడాది సూపర్ హిట్ అయిన హీరోల మాదిరి వినాయక ప్రతిమలను రూపొందిస్తుండటం ఫ్యాషన్ గా మారింది. ఆ మధ్య బాహుబలి వినాయక విగ్రహాలకు చాలా గిరాకీ వచ్చింది. మళ్లీ ఇప్పుడు పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాల్లోని హీరో పాత్రల మాదిరి విగ్రహాలను తయారు చేశారు.


కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పలుచోట్ల అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల పాత్రలకు సంబంధించిన పోజులతో వినాయక విగ్రహాలను సిద్ధం చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలను ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో పెట్టడంతో విపరీతంగా వైరల్ అవుతూ.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్ర పోషించిన అల్లు అర్జున్ డైలాగ్ 'తగ్గేదేలే..'. పలు చోట్ల ఇదే పుష్పరాజ్ పాత్ర ఆహార్యంలో.. అదే జుట్టు, వస్త్రాలు, ఇతర లక్షణాలతో.. తగ్గేదేలే అంటూ గడ్డంపై చేయి పెట్టినట్టుగా ఉన్న గణేశ ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటోంది.


అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించి వివిధ గెటప్ లలో తయారుచేసిన వినాయక విగ్రహాలు అలరిస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ లో అల్లూరి గెటప్ లో రామ్ చరణ్ పరిగెడుతూ ఉన్న ఆహార్యంలో రూపొందించిన గణేష్ విగ్రహాలు అబ్బురపరుస్తున్నాయి.



Tags:    

Similar News