కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన తన తండ్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ దయ, ప్రేమ, అభిమానం కలిగిన మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన అకాల మరణం తమ కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయనతో కలిసి ఉన్న రోజులు, కలిసి పుట్టిన రోజులు జరుపుకున్న సందర్భాలు తనకు ఇంకా గుర్తొస్తున్నాయన్నారు. రాజీవ్ లేకున్నా ఆయన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ బతికే ఉంటాయన్నారు.
Rajiv Gandhi was a kind, gentle and affectionate man whose untimely death left a deep void in my life.
I remember the times we had together and the many birthdays we were lucky to celebrate with him when he was alive.
He is greatly missed, but his memory lives on. pic.twitter.com/IGwTDJprRd
— Rahul Gandhi (@RahulGandhi) August 20, 2018
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. ఈ దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని ఆయన గర్తుచేస్తూ ట్వీట్ చేశారు.
Tributes to our former Prime Minister Shri Rajiv Gandhi Ji on his birth anniversary. We remember his efforts towards the nation.
— Narendra Modi (@narendramodi) August 20, 2018
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సైతం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు.
Fondly remembering our former Prime Minister Rajiv Gandhi ji on his birth anniversary
— Mamata Banerjee (@MamataOfficial) August 20, 2018