అసలు మీ వద్ద ప్రణాళిక ఉందా?

ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. సెకండ్ వేవ్ లో కరోనాను కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయిందన్నారు. ప్రజలు అనేక ఇబ్బందుల్లో [more]

Update: 2021-05-08 00:28 GMT

ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. సెకండ్ వేవ్ లో కరోనాను కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయిందన్నారు. ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని పట్టించుకోవాలని రాహుల్ గాంధీ తన లేఖలో కోరారు. కొత్త వేరియంట్స్ పై ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావాన్ని పరీక్షించాలని రాహుల్ గాంధీ కోరారు. దేశ వ్యాప్తంగా మెరుపు వేగంతో వ్యాక్సినేషన్ చేస్తేనే కరోనా కంట్రోల్ అవుతుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వద్ద వ్యాక్సినేషన్ పై స్పష్టమైన ప్రణాళిక లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. కరోనా పై విజయం సాధించకుండానే సంబరాలు జరుపుకున్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News