రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. ఐదేళ్ల క్రితం బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో [more]
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. ఐదేళ్ల క్రితం బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో [more]
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. ఐదేళ్ల క్రితం బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తీర్పునిచ్చింది. ప్రజా ప్రతినిధులు కు సంబంధించి ప్రత్యేక కోర్టు విచారణ జరుగుతుంది. నాంపల్లిలో ఏర్పాటైన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు రాజాసింగ్ కేసుకు సంబంధించి తీర్పునిచ్చింది. బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బీఫ్ ఫెస్టివల్ జరుతామని విద్యార్థులు ప్రకటించారు. దీనికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు . ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడ సంచలన వ్యాఖ్యలు చేయడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదివరకు బొల్లారం పోలీస్ స్టేషన్ లో రాజా సింగ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఇవాళ రాజాసింగ్ కేసు విచారణకు వచ్చింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలన్నీ రుజువు కావడంతో ప్రత్యేక న్యాయస్థానం రాజాసింగ్ కు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అయితే తన జైలు శిక్ష పైన రాజాసింగ్ వెంటనే బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు లో అప్పీల్ చేసేందుకు నెల సమయం కూడా విధించింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, పోలీసులు బలవంతంగా తనపై కేసులు పెట్టారని రాజాసింగ్ ఆరోపించారు