రెచ్చిపోతున్న రేవంత్ ..బాల్కన్ సుమన్

Update: 2018-10-01 02:30 GMT

తెలంగాణ లో ఎన్నికల వేడి బాగా పీక్ కి చేరుకుంటుంది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటి దాడుల అనంతరం ఆయన మరింత రెచ్చిపోతున్నారు. ఇక రేవంత్ కి ధీటుగా ఎంపి బాల్కన్ సుమన్ అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తూ తెలంగాణ రణక్షేత్రంలో మాటల తూటాల్లా పేల్చేస్తున్నారు. వీరిద్దరూ కొట్టే పంచ్ డైలాగ్స్ కి ఆయా పార్టీల శ్రేణులు హుషారౌతుంటే రోజు వీరి నోటి నుంచి కొత్త కొత్త బూతులు వినలేక పోతున్నారు జనం. గతంలో కెసిఆర్ ఉద్యమ సమయంలో కూడా వినియోగించని పదాలను ఇద్దరు నేతలు అలవోకగా వాడేస్తుండటం చర్చనీయాంశం అయ్యింది.

అదుపుతప్పుతున్న బాష...

ఎన్నికల కోడ్ ప్రవర్తన నియమావళి ఇంకా లేదు కానీ ఉంటే వీరిద్దరిపై ఈసీ చర్యలు తీసుకునేలా రేవంత్, సుమన్ లు తమ నోటికి పని చెబుతున్నారు. రేవంత్ కెసిఆర్ ఎంగిలి బొమికలు తినే వాడా, సన్నాసి కేసీఆర్, ఇలా నోటికొచ్చింది విసురుతున్నారు. దీనికి ధీటుగా సుమన్ నువ్వు పోటుగాడివా, వరంగల్ లో మొరిగిన కుక్కవు, మూడు అడుగులు ఉంటావు పొట్టోడా నీ బతుక్కి కెసిఆర్ అవసరం లేదంటూ మరిన్ని కటువైన పదజాలంతో దుమ్మెత్తి పోస్తున్నారు.

దిగజారి మరీ......

ఇలా ఇద్దరు చేస్తున్న వ్యాఖ్యలకు టీవీల్లో రేటింగ్స్ బావుండటంతో ఛానెల్స్ పదేపదే ప్రచారం చేస్తున్నాయి. దాంతో ఒక్కసారి తిట్టిన తిట్లు రోజంతా ఛానెల్స్ పుణ్యమాంటూ అందరు వినలేక పోతున్నారు. ఒకరిపై ఒకరు అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తుండటాన్ని పలువురు తప్పుపడుతున్నారు. కానీ ఆవేశంతో ఇద్దరూ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వ్యవస్థను దిగజార్చేలా ఉన్నాయి. ఇలాంటి బాషా ప్రయోగానికి ఎన్నికల కోడ్ రాకుండానే ఈసీ అడ్డుకట్ట వేయాలని ప్రజాస్వామ్య వాదులు కోరుకుంటున్నారు.

Similar News