రేవంత్ ఎపిసోడ్....నేడు తేలనుందా?

Update: 2018-10-03 02:30 GMT

రెండు రోజుల పాటు సోదాలు జరిపిన ఐటీ అదికారులు.. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించేందుకు సిద్దమయ్యారు . బుదవారం జరిగే విచారణలో రేవంత్‌ తో పాటు ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి , అనుచరులు ఉదయసింహ , స్టెబాస్టియన్‌లు కూడా ఆదాయపు పన్ను శాఖ అదికారుల ముందు హాజరుకానున్నారు.

ప్రశ్నలు సిద్థం......

కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని ప్రశ్నించేందుకు ఐటీ అదికారులు మరోమారు సిద్దమయ్యారు . ఈ నెల 28 ఉదయం 9 గంటల నుంచి 29 తెల్లవారుజామున 3 గంటల వరకూ.. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సోదాలు జరిపి..కీలక పత్రాలను స్వాదీనం చేసుకున్న ఐటీ అదికారులు..ఆస్థులు , ఆదాయపు పన్ను చెల్లింపుల వివరాలపై రేవంత్‌ను మరోమారు ప్రశ్నించబోతున్నారు . రేవంత్‌రెడ్డి ఇంట్లో స్వాదీనం చేసుకున్న పత్రాలను గత రెండు రోజులుగా విశ్లేషిస్తున్న అదికారులు..వాటికి సంబందించిన అనుమానాలతో..కొన్ని ప్రశ్నలను కూడా సిద్దం చేసారు. ఆ ప్రశ్నలను పేపర్‌పై ఉంచి రేవంత్‌కు ఇచ్చి..లిఖిత పూర్వక సమాదానాలు తీసుకోవాలని నిర్ణయించిన అదికారులు...భవిష్యత్తులో ఆయన మాట దాటవేసే వీలులేకుండా చేయబోతున్నారు.

ముగ్గురినీ ఒకే రోజు......

ఇక రేవంత్‌ సోదరుడు కొండల్‌రెడ్డికి సంబందించిన కంపెనీలు..వాటి ఆదాయ వివరాలను సేకరించిన ఐటీ శాఖ... రేవంత్ రెడ్డిని విచారించే రోజే మరోమారు విచారించబోతున్నారు . ఇప్పటికే సోమవారం ఐటీ అదికారుల ముందు విచారణకు హాజరైన కొండల్‌రెడ్డికి...మరోమారు విచారణకు హాజరుకావాలంటూ సూచించారు . దీంతో బుదవారం సోదరుడు రేవంత్‌తో పాటు కొండల్‌రెడ్డి కూడా ఐటీ కార్యాలయంలో విచారణకు రానున్నారు . ఇక ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయసింహ ఇంట్లో ఇప్పటికే సోదాలు జరిపిన ఐటీ అదికారులు..ఆయన నివాసంలో స్వాదీనం చేసుకున్న పత్రాలను సైతం రెండు రోజులుగా విశ్లేషిస్తున్నారు . సోమవారం ఐటీ అదికారుల ముందు విచారణకు హాజరైన ఉదయసింహ..తన విచారణకు మరింత సమయం ఇవ్వాలని అదికారులను కోరాడు..అప్పటికే ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలపై ఓ కొలిక్కి రాని అదికారులు ...మూడో తేదీన మరోసారి విచారణకు రావాలంటూ సూచించారు . దీంతో ఉదయసింహ సైతం బుదవారం ఐటీ అదికారుల ముందుకు రానున్నాడు . ఇక ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు స్టెబాస్టియన్‌ కూడా ఐటీ అదికారుల ముందు మరోమారు విచారణకు రానున్నాడు . దీంతో బుదవారం ఐటీ కార్యాలయంలో జరిగే విచారణ సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది . అందరినీ కలిపి విచారిస్తారా ? విడివిడిగా విచారించి ..వారి సమాధానాలను పోల్చి చూస్తారా ? ఇంతకీ బుదవారం ఐటీ కార్యాలయంలో ఏం జరగబోతోంది అంటూ అంతా చర్చించుకుంటున్నారు.

నేడు ఏం మలుపు తిరగనుందో...?

రేవంత్‌రెడ్డి , కొండల్‌రెడ్డి , ఉదయసింహ , స్టెబాస్టియన్‌....ఈ పేర్ల మధ్యలో తాజాగా రణదీర్‌రెడ్డి అనే మరో వ్యక్తి వచ్చిచేరాడు . నాగోల్‌ జైపురి కాలనీలోని రణదీర్‌రెడ్డి ఇంట్లో ఐటీ అదికారులమంటూ 15 మందికి పైగా సోదాలు జరిపి..రణదీర్‌ను తమ వెంట తీసుకెళ్లారంటూ..ఆయన ఆచూకీ కోసం కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఐటీ అదికారుల ముందు విచారణకు హాజరైన ఉదయసింహ తో దాడులు చేసింది తాము కాదంటూ ఐటీ అదికారులు చెప్పటంతో..ఈ ఎపిసోడ్‌ మరింత ఆసక్తిగా మారింది . చివరకు..రణదీర్‌ కారును తనిఖీ చేయగా కొన్ని విలువైన వస్తువులు బయటపడటంతో ...తామే అదుపులోకి తీసుకున్నామని ఉప్పల్‌ పోలీసులు తెలిపారు. రణధీర్‌ మాత్రం తనను విచారించింది టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అని చెబుతున్నాడు . రణధీర్‌ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో అన్న అంశం పక్కన పెడితే...ఉదయసింహ తన ఇంట్లో హార్డ్‌డిస్క్‌తో పాటు కొన్ని విలువైన వస్తువులు పెట్టాడనీ...తననుంచి స్వాదీనం చేసుకున్నవి ఉదయసింహవే అంటూ రణదీర్‌ చెప్పడం మరింత ఆసక్తిగా మారింది . అసలు ఉదయసింహ..ఆ హార్డ్‌డిస్క్‌ను ఎవరికీ చిక్కకుండా చేసేందుకే రణదీర్‌ వద్ద పెట్టాడా అన్న అనుమానాలూ లేకపోలేదు..ఇంతకీ అందులో దాగి ఉన్న నిజాలు ఏంటి ? రేవంత్‌కు సంబందించిన కీలక సమాచారం అందులో ఉన్నందుకే ఆ హార్డ్‌డిస్క్‌ను సేఫ్‌జోన్‌కు పంపాడా అన్నది ఐటీ అదికారులు అనుమానిస్తున్నారు . దీంతో ఆ హార్డ్‌డిస్క్‌ను తమకు అప్పగించాలంటూ ఐటీ అదికారులు ఉప్పల్‌ పోలీసులను కానీ..కోర్టును కానీ ఆశ్రయించాలని భావిస్తున్నారు. రోజుకో మలుపు తిరుగుతున్న రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడుల ఎపిసోడ్‌...బుదవారం జరిగే విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది .

Similar News