తనకు కేంద్ర బలగాలతో లేదా స్వతంత్ర సంస్థతో భద్రత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి వేసిన పిటీషన్ ను హైకోర్టు విచారించింది. రాజకీయ ప్రత్యర్థులు, సంఘ విద్రోహ శక్తులతో తనకు మెప్పు ఉన్నందున నలుగురు కేంద్ర భద్రతా సిబ్బందితో భద్రత కల్పించాలని రేవంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి పిటీషన్ ను విచారించిన కోర్టు ఆయన భద్రతకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ను, కేంద్ర హోంశాఖను ఆదేశించింది. రేవంత్ రెడ్డికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిదని కోర్టు ఈసీ, కేంద్ర హోంశాఖ తరపు న్యాయవాదులను ప్రశ్నించింది.