కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని గత పదహారు గంటలుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆదాయం ఎలా వస్తుంది? ఎన్నికల అఫడవిట్ లో చూపిన దానికి, తర్వాత వచ్చిన ఆదాయానికి పొంతన ఎందుకు లేదు? ఏ ఏ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది? ఈ సంస్థలతో మీకు సంబంధం ఏంటి? విదేశాల నుంచి నగదు ఎలా వచ్చింది? వంటి ప్రశ్నలతో రేవంత్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి భార్య గీతను వెంటబెట్టుకుని మూడు బ్యాంకులకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెళ్లి వచ్చారు. బ్యాంకుల్లో ఉన్న లాకర్లను తెరవాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిని ప్రశ్నించి అధికారులు వదిలేశారు. ఆయనకు నోటీసులు జారీ చేసి వచ్చే నెల 1వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని కొండల్ రెడ్డిని ఆదేశించారు. మూడు బ్యాంకర్లలో లాకర్లు ఓపెన్ చేయించాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు.