ఆ...హార్డ్ డిస్క్ లో ఏముంది....?

Update: 2018-10-02 04:37 GMT

ఐటీ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. రేవంత్ రెడ్డి అనుచరుడు ఉదయసింహ దాచిన హార్డ్ డిస్క్ అతని బంధువు రణధీర్ వద్ద లభ్యమైంది. వాహన తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ లో రణధీర్ ని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. రెండ్రోజుల క్రితం కనిపించకుండాపోయిన రణధీర్ రాత్రి ఉప్పల్ పోలీసుస్టేషన్ లో ప్రత్యక్షమయ్యాడు. ఐటీ కేసుకు సంబంధించి కీలకమైన విషయాలను అతని నుంచి రాబట్టేందుకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలుస్తోంది. ఐటీ దాడులను పసిగట్టి ముందే జాగ్రత్త పడాలని భావించిన ఉదయసింహ తన హార్డ్ డిస్క్ ను బంధువైన రణధీర్ వద్ద దాచాడని పోలీసులు గుర్తించారు.

క్రోడీకరించేందుకు......

ఉప్పల్ ప్రాంతంలోని జయపురికాలనీలో నివాసముండే రణధీర్ నుంచి హార్డ్ డిస్క్ తో పాటు.. నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఉదయసింహ తన బంధువైన రణధీర్ దగ్గర దాచిన హార్డ్ డిస్క్ లో ఏ సమాచారం ఉందో తెల్సుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ హార్డ్ డిస్క్ లో ఏముందో తనకు తెలియదని చెప్తున్నారు రణధీర్.ఉప్పల్ లో వాహన తనిఖీల్లో భాగంగా రణధీర్ ని అదుపులోకి పోలీసులు విచారించారు. పోలీసుస్టేషన్ బెయిల్ ఇచ్చి రణధీర్ ని అర్థరాత్రి ఇంటికి పంపారు పోలీసులు. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారని రామారావు అనే న్యాయవాది ఐటీకి ఫిర్యాదు చేయడంతో.. ఇందులో సాక్ష్యాధారాల సేకరణలో భాగంగా రణధీర్ ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పి అతన్ని పంపించేశారు పోలీసులు. హార్డ్ డిస్క్ లోని సమాచారాన్ని క్రోడీకరించేందుకు ఐటీ అధికారులకు పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Similar News