ఇక మహిళలే మహా రాణులు

మార్కెట్‌ యార్డులకు వెంటనే కమిటీల నియామయం జరపాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కమిటీలలో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని [more]

Update: 2019-10-03 10:23 GMT

మార్కెట్‌ యార్డులకు వెంటనే కమిటీల నియామయం జరపాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కమిటీలలో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. గురువారం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మార్కెటింగ్‌, సహకార శాఖలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు. పంట ప్రారంభంలోనే మద్దతు ధర ప్రకటించాలని ఆదేశించారు. అక్టోబర్‌ చివరి వారంలోగా పప్పు ధాన్యాలకు మద్దతు ధర ప్రకటించాలని, నియోజకవర్గాల స్థాయిలో గోడౌన్ల నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. అన్ని పంటలకు ఇనామ్‌ అమలు చేయాలన్నారు. ఆరు నెలల్లో దళారి వ్యవస్థను రూపుమాపాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.

 

Tags:    

Similar News