హైదరాబాద్ లో రోహింగ్యాల డ్రగ్స్ దందా

హైదరాబాద్‌ మహానగరం మత్తు పదార్ధాల మాఫియాకు అడ్డాగా మారుతోంది. దేశ విదేశాల నుంచి దిగుమతి అవుతున్న నార్కోటిక్స్‌.. సిటీలో విచ్చలవిడిగా అమ్ముడవుతోంది. ఇప్పటివరకు స్కూల్‌, కాలేజీ స్టూడెంట్స్‌ [more]

Update: 2019-01-11 13:04 GMT

హైదరాబాద్‌ మహానగరం మత్తు పదార్ధాల మాఫియాకు అడ్డాగా మారుతోంది. దేశ విదేశాల నుంచి దిగుమతి అవుతున్న నార్కోటిక్స్‌.. సిటీలో విచ్చలవిడిగా అమ్ముడవుతోంది. ఇప్పటివరకు స్కూల్‌, కాలేజీ స్టూడెంట్స్‌ ను టార్గెట్ చేసుకున్న ఈ మాఫియా.. ఇప్పుడు రోజు కూలీలను కూడా వదలట్లేదు. ఎక్కువ సేపు పనిచెయ్యడానికి టాబ్లెట్స్‌ రూపంలో ఉండే డ్రగ్స్‌ ను కూలీలకు ఎరగా వేస్తున్నారు. ఇలా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న మయన్మార్‌ ముఠా ఆట కట్టించారు రాచకొండ పోలీసులు. భారీగా డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు.

కొరియర్ లో తెప్పిస్తూ…

మయన్మార్ నుంచి ఇక్కడకు వచ్చిన రోహింగ్యాలు రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ సేపు పనిచెయ్యడానికి డ్రగ్స్‌ తీసుకుంటునట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇదే అదునుగా చూసుకుని దీనిని ఒక వ్యాపారంగా మల్చుకుంటున్నారు. డ్రగ్స్‌ ను వివిధ రూపాల్లోకి మార్చి పోలీసులకు దొరకకుండా దందాలు నిర్వహిస్తున్నారు. ఇలాగే బాలాపూర్‌లో టాబ్లెట్ల రూపంలో డ్రగ్స్‌ ను విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్‌ కి చెందిన అబిబాస్‌ రెహ్మాన్‌, మహ్మద్‌ రహీంలు నగరానికి వచ్చి నార్కోటిక్‌ డ్రగ్స్‌ ను టాబ్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. ఒక్కో టాబ్లెట్‌ను రెండు నుంచి మూడు వందలకు అమ్ముతూ గుట్టుగా వ్యాపారం సాగిస్తున్నారు. డబ్లూవై, యాబా పేరుతో వీటిని విక్రయిస్తున్నారు.

చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటూ…

మయన్మార్ దేశస్థులు అబిబాస్ రెహ్మాన్, మహ్మద్ రహీంలను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. నిందితులపై ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ డ్రగ్స్ చెర్రి రెడ్ కలర్ లో ఉన్నాయి. బర్మా దేశానికి చెందిన సలీం నుంచి కొరియర్ ద్వారా నిందితుల వద్దకు ఈ డ్రగ్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొ డ్రగ్ ట్యాబ్లెట్ ధర రూ.200 నుంచి రూ.300 రూపాయలు ఉంది. ఈ డ్రగ్ తీసుకుంటే మూడు రోజుల వరకు నిద్ర కూడా ఉండదు. డ్రగ్స్ దందా చేస్తున్న వీరంతా చట్టవిరుధ్దంగా దేశంలో ఉంటున్నారు.

Tags:    

Similar News