టీచరమ్మా! ఇదేం పని..?

మంచి చెడులు చెప్పాల్సిన ఓ టీచరమ్మ చెడు పనులలో మునిగి తేలిన వైనం కర్నాటకలో వైరల్‌ అవుతోంది. పదో తరగతి చదువుతున్న తన విద్యార్థితో ఆ ఉపాధ్యాయురాలు రొమాంటిక్‌ ఫోటోషూట్‌లో మునిగి తేలుతున్న అంశం ఇప్పుడు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. తన కంటే ఎంతో చిన్నవాడైన విద్యార్థితో హెడ్‌ మిస్ట్రెస్‌ (హెచ్‌.ఎం) ప్రవర్తించిన విధానంపై ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

Update: 2023-12-29 12:54 GMT

Karnataka

కర్నాటకలోని ఓ గ్రామంలోని స్కూల్‌ హెడ్‌ ఆవిడ. పాఠశాల తరఫున ఓ టూర్‌ ప్లాన్‌ చేశారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి, హెచ్‌.ఎం రొమాంటిక్‌ ఫోటోలు దిగారు. విద్యార్థి కుర్తా, ప్యాంట్‌లో హెచ్‌.ఎం పట్టుచీరలో పోజిలిచ్చారు. ఫోన్లలో బంధించిన ఆ ఫోటోలు పబ్లిక్‌ డొమైన్‌లోని వచ్చేశాయి.

దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు మండి పడుతున్నారు. హెచ్‌.ఎం.పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. పోక్సో చట్టం ప్రకారం మైనర్‌ బాలలతో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం, వారిని మానసికంగా, శారీరకంగా వేధించడం నేరం. ఇక కర్నాటక విద్యాశాఖాధికారులు తన హద్దులు దాటిన టీచరమ్మపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. 

Tags:    

Similar News