Ukraine War : యుద్ధం మొదలయింది... ప్రపంచ దేశాలకు పుతిన్ వార్నింగ్
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ప్రపంచ దేశాలకు కూడా పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్ లో సైనిక ఆపరేషన్ చేపట్టనున్నట్లు ఆయన ప్రకటిచంారు. ప్రజలను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రసంగించారు. ఉక్రెయిన్ ను కట్టడి చేయడమే తమ ముందున్న లక్ష్యమని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలన్న ఉద్దేశ్యం లేకపోయినా, ఆ దేశం నుంచి ఎదురవుతున్న ముప్పుకు రెస్పాన్స్ గానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పుతిన్ ప్రకటించారు.
రక్తపాతం జరిగితే?
రక్తపాతం జరిగితే అందుకు బాధ్యత ఉక్రెయిన్ పాలకులదే నని చెప్పారు. ఉక్రెయిన్ కు మద్దతుగా ఏ దేశం నిలిచినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రష్యా ముప్పేట దాడికి దిగడంతో ఉక్రెయిన్ కూడా అప్రమత్తమయింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. ఉక్రెయిన్ వేర్పాటు వాదులు లొంగిపోవాలని హెచ్చరించారు.
సరిహద్దుల్లో కాల్పుల మోత....
ఉక్రెయిన్ అప్రమత్తమయి ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈరోజు తెల్లవారు జాము నుంచే కాల్పులు ప్రారంభమయ్యాయి. మిలటరీ ఆపరేషన్ మొదలు కావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్ సరిహద్దులు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. అయితే ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు.