వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే... ఖరారు చేసిన జగన్

ఎమ్మెల్సీ అభ్యర్థులను సామాజిక న్యాయాన్ని అనుసరించే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించడం జరిగిందనిసజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు

Update: 2023-02-20 09:23 GMT

ఎమ్మెల్సీ అభ్యర్థులను సామాజిక న్యాయాన్ని అనుసరించే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించడం జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఎన్నో వడపోతలు అనంతరం వీరిని నిర్ణయించారని తెలిపారు. కేబినెట్ లోనూ అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించారని చెప్పారు. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా విధానంగా వైఎస్ జగన్ చూపుతున్నారన్నారు. నిజమైన సాధికారికత దిశగా అడుగులు వేసేందుకు ఈ నియామకాలు తోడ్పడతాయని తెలిపారు.

రాజకీయ సాధికారికత....
స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను జగన్ ఖరారు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజకీయ సాధికారికత అంటే నిజంగా చూపించాలన్న లక్ష్యంతోనే నియామకాలు చేపట్టడం జరిగిందన్నారు. అధికారంలో బలహీనవర్గాలు పాలు పంచుకోవాలన్న లక్ష్యంతోనే నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలోనూ కాకుండా అవకాశం వచ్చినప్పుడు వారికి ఛాన్స్ ఇచ్చే విధంగా చర్యలు ఉంటున్నాయని తెలిపారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి బలహీన వర్గాలకు పదవులు ఇచ్చారన్నది చూసుకోవాలని అన్నారు.
చిత్తశుద్ధిలేని...
ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలనుకుంటుందని, అయితే శాసనమండలి, రాజ్యసభ సభ్యుల ఎంపికలో సామాజిక న్యాయం చూపడం జరిగిందన్నారు. 2014 -19 టీడీపీ హయాంలో మండలికి 48 మందిని ఎంపిక చేస్తే 30 అగ్రవర్ణాలన్నారు. 18 మందికి మాత్రమే బలహీన వర్గాల వారికి ఇచ్చారన్నారు. టీడీపీ చిత్తశుద్ధి అక్కడే కనపడుతుందన్నారు. 62.5 శాతం మంది ఓసీలకు ఇచ్చారన్నారు. ఛాన్స్ లేనప్పుడు వర్ల రామయ్య లాంటి వారిని ఎన్నికల బరిలోకి దించుతారని సజ్జల అన్నారు. 18 మంది నియామకాలు చేస్తే బీసీలు11, ఎస్సీలు ఇద్దరు, ఒక ఎస్టీ, నలుగురు ఓసీలున్నారు. ప్రస్తుతం శాసనమండలిలో 44 మందికి గాను 19 మంది బీసీలు, ఆరుగురు ఎస్సీ, ఒక ఎస్టీ, నలుగురు మైనారిటీలు మిగిలిన వాళ్లు ఓసీలు ప్రస్తుతం మండలిలో ఉండబోతున్నారని తెలిపారు. స్థానాల జగన్ నిర్ణయం చరిత్రాత్మకమైనదన్నారు. విప్లవాత్మకమైనదని చెప్పారు. ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇధ్దరు, స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారన్నారు.

01. శ్రీకాకుళం - నర్తు రామారావు

02. కుడిపూడి సూర్యనారాయణ - తూర్పు గోదావరి

03. వంకా రవీంద్ర నాధ్ ( పశ్చిమగోదావరి)

04. కవురు శ్రీనివాస్ (పశ్చిమగోదావరి)

05. సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు)

06. పి. రామసుబ్బారెడ్డి ( కడప)

07. డాక్టర్  ఎ. మధు సూదన్ ( కర్నూలు)

08.  ఎస్. మంగమ్మ ( అనంతపురం)

09. బొమ్మి ఇజ్రాయిల్ ( తూర్పుగోదావరి)

10. పెన్మత్స సూర్యనారాయణ రాజు (విజయనగరం)

11. పోతుల సునీత ( ప్రకాశం జిల్లా)

12. కోలా గురువులు (విశాఖపట్నం)

13. జయ మంగళ వెంకట రమణ ( ఏలూరు జిల్లా)

14. చంద్రగిరి ఏసురత్నం ( గుంటూరు)

15. మర్రి రాజశేఖర్ ( పల్నాడు జిల్లా)

16, మేరుగ మురళీధర్

17. కుంభా రవిబాబు ( అరకు జిల్లా)

18. కర్రి పద్మశ్రీ ( కాకినాడ జిల్లా)



Tags:    

Similar News