చంద్రబాబు పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టండి

చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారం పై పౌర సమాజం తిరగబడాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొత్త వేరియంట్ అంటూ చంద్రబాబు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారన్నారు. [more]

Update: 2021-05-08 00:47 GMT

చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారం పై పౌర సమాజం తిరగబడాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొత్త వేరియంట్ అంటూ చంద్రబాబు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారన్నారు. బాబు తప్పుడు ప్రచారంపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు నిచ్చారు. సీసీఎంబీ, సెంట్రల్ బయోటెక్నాలజీలు ఈ వేరియంట్ పాతదేనని తేల్చినా చంద్రబాబు పదే పదే ఎన్ 440కే వేరియంట్ ప్రమాదకరమని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ స్ట్రెయిన్ ప్రమాదకరం కాదంటూ శాస్త్రవేత్తలు చెప్పినా చంద్రబాబు చెవికి ఎక్కడం లేదా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వ్యాక్సిన్ సరఫరా చేస్తే రోజుకు ఆరులక్షల మందికి ఇవ్వగలిగిన కెపాసిటీ ఉందన్నారు. చంద్రబాబు ఏం చేసినా ఎదుర్కొనగలిగే శక్తి జగన్ కు ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మనిషి రూపంలో ఉన్న దెయ్యంలాగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. బాబు విషప్రచారంతోనే ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు ఏపీ ప్రజల ప్రయాణాలపై నిషేధాన్ని పెట్టాయని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News