శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 10 నుంచి 50 ఏళ్ల మధ్య మహిళలకు శబరిమల ఆలయంలోకి అనుమతించారు. ఈ నిషేదంపై పలు మహిళా, స్వచ్చంద సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. మహిళలను దేవతలుగా పూజించే దేశంలో ఆలయంలో మహిళలకు నిషేధం విధించడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. శబరిమలతోకి మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం 4-1 మెజారిటీతో తీర్పు వెల్లడించింది.