తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత అబ్దుల్ ఘనీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అబ్దుల్ ఘనీ హిందూపురం నియోకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీనేత. ఆయన గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి గెలిచారు. ప్రస్తుతం నారా చంద్రబబుానాయుడు బామ్మర్ది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు.
టిక్కెట్ దక్కదనేనా....?
ఈసారి కూడా నందమూరి బాలకృష్ణ బరిలోకి దిగుతారని తెలియడంతో అబ్దుల్ ఘనీ పార్టీని వీడినట్లు తెలుస్తోంది. మరోవైపు హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జిగా ఉన్న నవీన్ నిశ్చల్ పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది. జగన్ ఆయనను బుజ్జగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముస్లిం ఓటర్లు హిందూపురం నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటంతో అబ్దుల్ ఘని చేరికతో పార్టీ లాభిస్తుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి దగ్గరుండి అబ్దుల్ ఘనిని పార్టీలోకి తీసుకు వచ్చారు. మరి నవీన్ నిశ్చల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.