ఆటే కాదు మాటల్లోనూ మనోళ్ళే స్పీడే …!!

ఆస్ట్రేలియా తో క్రికెట్ అంటే వారితో ఆటకన్నా ఆ టీం లోని క్రీడాకారులు చేసే స్లెడ్జింగ్ ను తట్టుకుని నిలబడటం చాలా కష్టం. గతంలో హర్భజన్ సైమండ్స్ [more]

Update: 2018-12-30 02:52 GMT

ఆస్ట్రేలియా తో క్రికెట్ అంటే వారితో ఆటకన్నా ఆ టీం లోని క్రీడాకారులు చేసే స్లెడ్జింగ్ ను తట్టుకుని నిలబడటం చాలా కష్టం. గతంలో హర్భజన్ సైమండ్స్ మంకీ గెట్ వివాదం అందరికి తెలిసిందే. ఇలాంటి నోటిదురుసు లో వెనుకబడిన మనోళ్ళు ఇప్పుడు స్పీడ్ అయ్యారు. ఆసీస్ కి ఏ మాత్రం తగ్గడం లేదు కోహ్లీ కుర్రోళ్ళు. మాటకు మాట బదులివ్వడమే కాదు ఆసీస్ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బకొట్టేస్తున్నారు.

పుండు మీద కారం చల్లుతున్న …

ధోని స్థానంలో వచ్చిన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మామూలోడు కాదని ఆసీస్ తో మెల్బోర్న్ లో సాగుతున్న మూడో టెస్ట్ లో తేలింది. పంత్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన సందర్భంలో అతడి పై కెప్టెన్ ఫైన్ బృందం మాటలతో కవ్వించింది. బిగ్ బాస్ లో ఛాన్స్ ఇస్తామని, తన పిల్లలను చూసుకుంటే పెళ్ళాంతో సినిమాకు పోతా అంటూ అనేక సెటైర్స్ విసిరారు. వారి మాటలు భరిస్తూ చక్కగా ఏకాగ్రతగా బ్యాటింగ్ చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ పై తనదైన శైలిలో స్లెడ్జింగ్ సాగించాడు. అసలే వరుస వికెట్లు చేజార్చుకుంటూ పరాజయానికి చేరువ అవుతున్న ఆసీస్ ఆటగాళ్లకు పంత్ తనడైలాగ్స్ తో పచ్చడి చేస్తూ ఉండటంతో పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది. పంత్ పై ప్రత్యర్థుల డైలాగ్స్ వారికి ధీటుగా ఆతరువాత రిషబ్ పంచ్ లు అన్ని వికెట్ల వెనుక మైక్రోఫోన్స్ రికార్డ్ చేయడంతో సోషల్ మీడియా లో ఈ వ్యవహారం వైరల్ అయ్యింది.

Tags:    

Similar News