ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తాం

తాము అధికారంలోకి వస్తే ఏపీలోని ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అన్ని ప్రాంతాలకు తాగు, సాగునీరు అందిస్తామని సోము వీర్రాజు చెప్పారు. [more]

Update: 2020-12-10 11:10 GMT

తాము అధికారంలోకి వస్తే ఏపీలోని ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అన్ని ప్రాంతాలకు తాగు, సాగునీరు అందిస్తామని సోము వీర్రాజు చెప్పారు. నలభై వేల కోట్లతో ప్రాజెక్ఠులు పూర్తి చేస్తామని ఏపీ సీఎం జగన్ చెబుతున్నారని, కానీ తాము తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులను పూర్తి చేస్తామనిచెప్పారు. కేవలం 1,800 కోట్లతో కేంద్ర ప్రభుత్వం అమరావతిలో ఎయిమ్స్ నిర్మించిందని, కానీ 7,200 కోట్లతో చంద్రబాబు అమరావతిని ఎందుకు నిర్మించలేకపోయారని సోము వీర్రాజు ప్రశ్నించారు. తాము ఎట్టిపరిస్థితుల్లో 2024లో అధికారంలోకి వస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

Tags:    

Similar News