ఆహ్వానించేందుకు జగన్ అవకాశం ఇవ్వడం లేదు
అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షాన్ని కూడా ఆహ్వానిస్తామని, అయితే జగన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వడం లేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. అసెంబ్లీ [more]
అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షాన్ని కూడా ఆహ్వానిస్తామని, అయితే జగన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వడం లేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. అసెంబ్లీ [more]
అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షాన్ని కూడా ఆహ్వానిస్తామని, అయితే జగన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వడం లేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు అధికారపక్షంతో పాటు ప్రతిపక్షం కూడా హాజరైతేనే స్పీకర్ గా తనకు సభ నిర్వహణ ఛాలెంజింగ్ గా ఉంటుందన్నారు. సభ నిర్వహించే సమయంలో తాను నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, అసెంబ్లీకి రాకుండా అలవెన్సులు పొందడం నైతికతకు సంబంధించిన విషయమన్నారు. ఫిబ్రవరి 5న బడ్జెట్ ప్రవేశపెడతారని, 6, 7, 8 తేదీల్లో బడ్జెట్ పై చర్చ ఉంటుందన్నారు.