అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే

కరోనా తీవ్రత దృష్ట్యా అందరూ కోవిడ్ టెస్ట్ లు చేసుకోవాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నిర్ణయించారు. ఈ నెల 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ [more]

Update: 2020-09-05 02:51 GMT

కరోనా తీవ్రత దృష్ట్యా అందరూ కోవిడ్ టెస్ట్ లు చేసుకోవాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నిర్ణయించారు. ఈ నెల 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలు, పోలీసులు, అధికారులు, మీడియా సిబ్బంది కూడా కోవిడ్ టెస్ట్ లు చేసుకున్న తర్వాతనే ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం లోగా కోవిడ్ టెస్ట్ లు చేయించుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు.

Tags:    

Similar News