ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన జరిగి 10 రోజులైనా అనేక అనుమానాలకు సమాధానాలు మాత్రం దొరకడం లేదు. అసలు ఘటనకు పాల్పడ్డ వ్యక్తి ఎవరు అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఘటన జరగగానే నిందితుడు జగన్ అభిమాని అని పోలీసులు, మంత్రులు, ముఖ్యమంత్రి తేల్చేసినా వైసీపీ మాత్రం అస్సలు కాదు అంటోంది. జగన్ తో నిందితుడు ఉన్నట్లుగా పోలీసులు చూపించిన ఫ్లెక్సీల్లో మార్పులు ఉండటంతో ఇవి కచ్చితంగా సృష్టించినవే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు అనేక అనుమానాలు కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.
పదేళ్ల నుంచి తాను...
అయితే, తాజాగా ఈ విషయమై ఎంపీ హర్షకుమార్ స్పందించారు. అమలాపురం నియోజకవర్గానికి తాను 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేశానని, నిందితుడి స్వగ్రామం థానేలంక గురించి అన్ని విషయాలు తెలుసని హర్షకుమార్ పేర్కొన్నారు. జనుపల్లి శ్రీనివాసరావు పక్కా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని ఆయన స్పష్టం చేశారు. పోలీస్ విచారణను తప్పుదారి పట్టిస్తున్నారని, ఇది కచ్చితమైన కుట్ర అని ఆయన ఆరోపించారు. ఈ మేరకు హర్షకుమార్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.