లాక్ డౌన్ సమయంలో వేలాది వాహనాలను…..?
కరోనా వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా విధించిన లాక్ డౌన్ అమలును ఇంకా కొంత మంది అతిక్రమిస్తున్న నేపధ్యంలో [more]
కరోనా వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా విధించిన లాక్ డౌన్ అమలును ఇంకా కొంత మంది అతిక్రమిస్తున్న నేపధ్యంలో [more]
కరోనా వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా విధించిన లాక్ డౌన్ అమలును ఇంకా కొంత మంది అతిక్రమిస్తున్న నేపధ్యంలో సైబరాబాద్ పోలీసులు అతిక్రమణదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. ఇప్పటికే 478 కేసులు నమోదు చేసిన పోలీసులు వేలాదిగా వాహనాలను జప్తు చేయడం జరిగింది. ఇప్పటికే నగరం మొత్తం మీద 7 లక్షల పైగా ఉన్న సీసీటీవీ కెమెరాలలో, సైబరాబాద్ లో ఉన్న లక్షా పదిహేను వేల కెమెరాలను కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేశారు. వీటి ద్వారా రోడ్ల మీద ప్రజల కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఇదే కాకుండా పలు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ప్రజల కదలికలు పసిగట్టి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు పోలీసు వారి అమ్ముల పొదిలో మరో సాంకేతిక అస్త్రం జత అయ్యింది. ఇదే “లాక్ డౌన్ వయొలేషన్ ట్రాకింగ్ అప్లికేషన్”. దీనిని తెలంగాణ పోలీసు శాఖ తయారు చేయగా, అన్ని చెక్ పోస్టులలో ఉన్న అధికారులకు టాబ్ లలో ఇన్ స్టాల్ చేశారు. ఎవరైనా ఒక వ్యక్తి రోడ్ మీదకు వచ్చిన వెంటనే సమీపంలో ఉన్న పోలీసు అధికారి అతని వివరాలు టాబ్ లో నమోదు చేస్తారు. ఆ వ్యక్తి ఆ ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే అదికూడా కేవలం అత్యవసరాల నిమిత్తం మాత్రమే బయటకు వెళ్లవచ్చు. అది కూడా జీవో 45, 46 లలో పేర్కొన్న నిబంధనల మేరకు, మోటార్ సైకిల్ పై ఒక వ్యక్తి, కార్ లో డ్రైవరు కాక మరొక వ్యక్తికి మాత్రమే అనుమతి ఉంటుంది.
నిబంధనలను అతిక్రమిస్తే…?
ఒకవేళ ఎవరైనా ఈ మూడు కిలోమీటర్ల పరిధిని దాటితే ఆ వ్యక్తి వాహనాన్ని జప్తు చేసి, అతనిపై “జాతీయ విపత్తుల నియంత్రణ చట్టం”, “అంటువ్యాధుల నివారణ చట్టం” మరియు “భారతీయ శిక్షా స్మృతి” మేరకు కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటారు. దీన్ని అతిక్రమించిన వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా పడే అవకాశం ఉంది. జప్తు చేసిన వాహనం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ప్రజలు ఎవరైనా కూడా అనవసరంగా రోడ్ల మీదకు రావద్దని పోలీసులు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు. ఒకవేళ అత్యవసరంగా రావాల్సి వస్తే, నిబంధనల మేరకు మాత్రమే రావాలి. ప్రతి చిన్న అవసరానికి బయటకు రాకుండా కనీసం రెండు మూడు రోజుల పాటు సరిపోయేలా అన్ని రకాల నిత్యావసరాలను ఒకేసారి కొనుగోలు చేసుకోవాలి. ఈ విధంగా బయటకు తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన వారు కూడా, ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది.