వరదలతో బిక్కుబిక్కుమంటున్న కేరళకు వివిధ రాష్ట్రాలు అండగా ఉంటున్నాయి. తమవంతు ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తున్నాయి. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళకు రూ.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీంతో పాటు 20 టన్నుల పాల పొడి, ఇతర నిత్యావసర వస్తువులు అందిస్తారు. ఇక పంజాబ్ అందరికంటే ముందుగా రూ.10 కోట్లు ప్రకటించింది. బిహార్, హర్యానా కూడా రూ.10 కోట్ల చోప్పుల ప్రకటించాయి. ఒరిస్సా, ఝార్ఖండ్ రాష్ట్రలు రూ.5 కోట్ల చొప్పున అందచేస్తున్నాయి. తమిళనాడు సైతం రూ.5 కోట్లు, 300 టన్నుల పాల పొడి, 500 టన్నుల బియ్యం అందజేసేందుకు ముందుకొచ్చింది.ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పదికోట్ల సాయాన్ని ప్రకటించింది.