పాన్ కార్డులో ఉన్న మీ ఫోటో మార్చడం ఎలా?
ఈ రోజుల్లో ఆధార్, పాన్ కార్డు ఉండటం తప్పనిసరి. ఇవి లేకుంటే చాలా పనులు జరగవు. ఇక పాన్ కార్ట్ లేకుంటే
ఈ రోజుల్లో ఆధార్, పాన్ కార్డు ఉండటం తప్పనిసరి. ఇవి లేకుంటే చాలా పనులు జరగవు. ఇక పాన్ కార్ట్ లేకుంటే బ్యాంకు లావాదేవీల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. బ్యాంకు అకౌంట్ తీయడం నుంచి వివిధ రకాల లావాదేవీలకు పాన్ కార్డ్ తప్పనిసరి. నేటి కాలంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో.. బ్యాంకు లావాదేవీలకు పాన్ కార్డు అంతే ముఖ్యంగా మారిపోయింది. పాన్ లేకపోతే బ్యాంకింగ్ రంగానికి చెందిన పనులతో పాటు ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సంబంధించిన ఏ పనులు జరగవు. ఆధార్, పాన్ లేకపోతే పనులన్ని నిలిచిపోతాయి. అయితే పాన్ కార్డుల్లో మీ ఫోటో స్పష్టంగా కనిపించదు. అలాంటి సమయంలో పాన్‌లో మీ ఫోటోను కూడా మార్చుకోవచ్చు. గతంలో పాన్, ఆధార్‌లో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే ఆన్‌లైన్ సెంటర్, మీసేవ సర్వీస్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పెరగడంతో ఇంట్లోనే ఉండి మార్పు, చేర్పులు చేసుకునే వెసులుబాటు వచ్చింది.
పాన్‌కార్డ్‌లో మీ ఫోటో బ్లర్‌గా ఉంటే మార్చుకోవచ్చు. మీరు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ లో మార్చుకోవచ్చు. అయితే దీని కోసం మీరు కొన్ని దశలను అనుసరించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్‌లో బ్లర్ ఫోటోని మార్చే విధానాన్ని ఎలాగో తెలుసుకుందాం.
పాన్ కార్డ్‌లో ఫోటో మార్చడం ఎలా:
☛ ముందుగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) ఆన్‌లైన్ సర్వీసెస్ వెబ్‌సైట్ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html లింక్‌పై క్లిక్ చేయండి.
☛ అప్లికేషన్ టైప్‌లో Changes or corrections in the existing PAN Data సెలెక్ట్ చేయాలి.
☛ కేటగిరీలో ఇండివిజ్యువల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
☛ ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పాన్ నెంబర్ లాంటి వివరాలు నమోదు చేయాలి.
☛ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
☛ ఆ తర్వాత కేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
☛ ఫోటో మార్చాలనుకుంటే Photo Mismatch ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
☛ ఆ తర్వాత వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
☛ ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
డిక్లరేషన్ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ చేయాలి.
☛ సంతకం మార్చాలనుకుంటే Signature Mismatch సెలెక్ట్ చేసి పైన చెప్పిన దశలను అనుసరించాలి.
☛ మీ అడ్ర భారత్‌లో ఉంటే ఇందు కోసం కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
☛ ట్రాన్సాక్షన్ పూర్తి చేసిన తరర్వాత 15 అంకెల అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది.
☛ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్‌తో స్టేటస్ చెక్ చేయవచ్చు.
☛ ఇలా చేసిన తర్వాత మీ ప్రక్రియ పూర్తవుతుంది.